అర్జున్ రెడ్డి అర్జున్ చేయాల్సిందట..!
టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. ఈ సినిమాను నెరేట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగ ఎంచుకున్న మార్గం అప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడలేదు. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎంత బలమైన ఇంపాక్ట్ వేశాడో, హీరోగా విజయ్ దేవరకొండ కూడా అదే స్థాయిలో ప్రత్యేకతను చాటుకున్నాడు.
మామూలుగా అయితే విజయ్ క్యారెక్టర్ లో మరో హీరోను ఊహించుకోలేం. విజయ్ కోసమే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ పుట్టిందని, అతను తప్ప మరో హీరో చేయలేడని అనుకున్నారు. అయితే వాస్తవానికి ఈ పాత్ర కోసం డైరెక్టర్ ముందుగా ఊహించుకున్నది విజయ్ ను కాదని, అల్లు అర్జున్ ను దృష్టిలో ఉంచుకునే సందీప్ ఈ పాత్రను రాసుకున్నట్లు వెల్లడించాడు.
బన్నీని కలిసి అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పాలని ఎంతో ట్రై చేసినప్పటికీ కుదరలేదని, అర్జున్ క్యారెక్టర్ లో విజయ్ అద్భుతంగా నటించినప్పటికీ, బన్నీ ఆ క్యారెక్టర్ చేసుంటే కమర్షియల్ అర్జున్ రెడ్డి నెక్ట్స్ లెవెల్ కు వెళ్లేదని చెప్పాడు సందీప్. అంతేకాదు అర్జున్ రెడ్డి హిట్ తర్వాత బన్నీకి ఓ స్టోరీ కూడా చెప్పాడట సందీప్. తమ కాంబినేషన్లో భవిష్యత్తులో కచ్ఛితంగా సినిమా ఉంటుందని, బన్నీ కోసం ఓ స్పెషల్ స్టోరీ రాస్తానని చెప్పుకొచ్చాడు సందీప్.













