బన్నీ బాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ డబ్బింగ్ సినిమాలకు హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వుంది. సరైనోడు, నా పేరు సూర్య వంటి చిత్రాలకు హిందీ యూట్యూబ్ చానల్స్‌లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. అందుకే బాలీవుడ్ నుంచి బన్నీకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయట. మరి త్రివిక్రమ్ సినిమా తరువాత బాలీవుడ్లో సినిమా చేస్తాడేమో చూడాలి.













