బన్నీ నోట పుష్ప3
యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప-2 కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్పకు మంచి టాక్ రావడం, బన్నీకి నేషనల్ అవార్డు రావడం, పుష్ప స్థాయి ప్రపంచ మంతటా తెలియడంతో పుష్ప2ను మరింత గ్రాండియర్ గా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.
పుష్ప2 కోసం ఎంతో టైమ్ తీసుకుని మరీ సుకుమార్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పుష్ప3 గురించి వార్తలొస్తున్నాయి. పుష్ప2కు క్లైమాక్స్ లో ఓపెన్ ఎండింగ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
రీసెంట్ గా పుష్ప-3 విషయంపై అల్లు అర్జున్ స్పందించాడు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు గెస్టుగా వెళ్లిన బన్నీ అక్కడ పుష్ప2ను ప్రమోట్ చేసే పనిలోభాగంగా పార్ట్-3 గురించి కొన్ని హింట్స్ ఇచ్చాడు. పుష్పను ఫ్రాంఛైజీగా మార్చాలనుకుంటున్నట్లు, లైనప్ కోసం తమ దగ్గర అద్భుతమైన ఆలోచనలున్నట్లు, పుష్ప-3ని కచ్ఛితంగా ఆశించొచ్చని బన్నీ తెలిపాడు. పుష్ప-2 తర్వాత తాను భారీ స్థాయి సినిమాలను చేయనున్నట్లు బన్నీ వెల్లడించాడు.













