Allu Arjun: బన్నీకి ఊరటనిచ్చిన నాంపల్లి కోర్టు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప2(Pushpa2) బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నా సంధ్య థియేటర్ దగ్గర జరిగన దుర్ఘటన వల్ల బన్నీ(Bunny) ఫ్యాన్ ఒకరు చనిపోవడం, దాంతో తనపై కేసు నమోదవడం, ఏకంగా బన్నీ జైలుకు వెళ్లాల్సి రావడం వల్ల బన్నీ తన సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఏదో కోల్పోయిన వాడిలా ఇంట్లోనే కుమిలిపోతున్న బన్నీకి నాంపల్లి కోర్టు తాజాగా పెద్ద ఊరటనిచ్చింది.
ఆల్రెడీ బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరవాలని ఓ రూల్ పెట్టడంతో పాటూ విదేశాలకు వెళ్లకూడదని కండిషన్ కూడా పెట్టింది. ఈ క్రమంలో ప్రతి ఆదివారం బన్నీ పోలీస్స్టేషన్ కు వెళ్లి వస్తున్నాడు. ఇదిలా ఉంటే బన్నీకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన కండిషన్స్ ను సడలిస్తూ నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక మీదట బన్నీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరవాల్సిన పని లేదని నాంపల్లి కోర్టు తెలిపింది. అంతేకాదు బన్నీ విదేశాలకు వెళ్లకుండా ఉండాలని పెట్టిన నిబంధనను కూడా కోర్టు ఎత్తివేస్తూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. బన్నీకి ఊరట దక్కడంపై అతని ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు. కాగా బన్నీ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(Trivikram) తో చేయనున్న విషయం తెలిసిందే.













