బన్నీకి తమిళ నిర్మాణ సంస్థ నుంచి బంపరాఫర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమానూ ఓ పట్టాన ఓకే చేయడు. ఒకసారి ఒక సినిమా మీదే ఫోకస్ పెట్టే బన్నీ, కొత్త కథలు విన్నా సరే వాటికి వెంటనే ఓకే అనడు. చాలా మంది డైరెక్టర్లు బన్నీకి కథలు చెప్పి కొన్ని నెలల పాటూ తనతో స్టోరీ డిస్కషన్స్ జరిపి సైడ్ అయ్యారు. అందుకే బన్నీ తర్వాతి సినిమా ఫలానా డైరెక్టర్ తో అని ఎన్ని వార్తలొచ్చినా సరే ఆడియన్స్ అంత ఈజీగా నమ్మరు.
పుష్ప తర్వాత బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేట్లు కనిపించడం లేదు. త్రివిక్రమ్ తో కంటే ముందు బన్నీ మరో సినిమా చేస్తాడని అంటున్నారు.
అయితే బన్నీతో సినిమా చేసే ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పుడు బన్నీని ఓ సినిమాకు లాక్ చేసినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ-అట్లీ కాంబోలో రానున్న ఈ సినిమా కోసం బన్నీకి సదరు నిర్మాణ సంస్థ ఏకండా రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేసిందట. పుష్ప సినిమాతో బన్నీ మార్కెట్, ఇమేజ్ పెరగడంతో అతనికి ఇంద పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.













