పుష్ప సక్సెస్‌ను దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. బన్నీ నటనకు ఇండియా లెవల్లో సెలబ్రిటీస్, సామాన్య ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక పుష్ప పాటలు సోషల్ మీడియాను ఏ రేంజ్లో ఊపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు. ఈ సందర్భంగా దుబాయ్ స్కైలైన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ యమ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు బన్నీ. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాసేపటికే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక పుష్ప పార్ట్-2 షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.













