Allu Arjun: డబ్బింగ్ కోసం బయటికొచ్చిన అల్లు అర్జున్
పుష్ప2(Pushpa2) సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని సిట్యుయేషన్ లో ఉన్నాడు బన్నీ(Bunny). సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్, ఆ తర్వాత పరిణామాల వల్ల బన్నీ అసలు బయటకు రావడం లేదు. ఇప్పుడు తాజాగా బన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ లో డబ్బింగ్ చెప్పడానికి బయటికొచ్చాడు.
అదేంటి? పుష్ప2 తర్వాత బన్నీ ఏ సినిమాను మొదలుపెట్టలేదు కదా మరే సినిమాకు డబ్బింగ్ చెప్తున్నాడనే డౌట్ రావొచ్చు. అదే అసలు ట్విస్ట్. బన్నీ ప్రస్తుతం డబ్బింగ్ చెప్తుంది పుష్ప2 కోసమే. ఈ సినిమా రన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేశారు. దీంతో కథ కంటిన్యూటీ దెబ్బ తింది. కంటిన్యూటీ మిస్ అయిన సీన్స్ ను ఇప్పుడు కలపాలని చూస్తున్నారట.
వాస్తవానికి ఇప్పటికే ఆ సీన్స్ థియేటర్లలో జోడించాల్సింది. కానీ ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పడానికి బన్నీ అందుబాటులో లేకపోవడం వల్లే ఇంత లేటయింది. జనవరి 1 నుంచి కొత్త సీన్స్ ను పుష్ప2లో యాడ్ చేయనున్నారట. అందుకే బన్నీ ప్రస్తుతం డబ్బింగ్ చెప్తున్నాడని తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ పూర్తయ్యాక మిగిలిన భాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేసి కొత్త సంవత్సరం నుంచి ఆ సీన్స్ ను యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.













