లవర్స్ డే కోసం…ముఖ్య అతిథిగా బన్నీ
మలయాళ బ్యూటీ వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది సౌత్ నుంచి గూగూల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. అత్యధికంగా గూగుల్‌లో ఆమె గురించి అన్వేషించారంటే ఆమెకు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. దాంతో ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్రం ఒరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియో లాంచ వేడుక ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 23న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయం గురించి చిత్ర బృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగులో ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సుఖీభవ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఒమర్లులు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించారు.













