త్రివిక్రమ్ కంటే ముందు బన్నీ మరో మూవీ
మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీకి దానికి సంబంధించిన స్టోరీని చెప్పి లాక్ చేసుకున్నాడని టాక్. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి, ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయడానికి ఎంత లేదన్నా ఏడాదిన్నర టైమ్ పడుతుందట.
త్రివిక్రమ్ తో చేయబోయే సోషియో ఫాంటసీ మూవీ కంటే ముందు బన్నీ మరో డైరెక్టర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. తనకు సరైనోడు లాంటి హిట్ ఇచ్చిన బోయపాటికి బన్నీ మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ దాని కోసం బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
అయితే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చింది బాలయ్య మూవీ కోసమనుకున్నారంతా. కానీ బన్నీ హీరోగా తెరకెక్కే మూవీ కోసం బోయపాటిని స్టోరీ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. మరి బోయపాటి తన కథతో బన్నీని మెప్పిస్తే త్రివిక్రమ్ కంటే ముందే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ కాంబినేషన్ ఎంతవరకు ఫైనల్ అవుతుందనేది చూడాలి. ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు.













