క్రేజీ ఆఫర్ కొట్టేసిన సంయుక్త
సంయుక్త మీనన్ టాలీవుడ్లోనే మోస్ట లక్కీ హీరోయిన్ అయిపోయింది. మలయాళంలో ఆమెకు ఇన్ని హిట్లు ఎప్పుడు రాలేదు. రీసెంట్గా విరూపాక్షలో తన పెర్ఫార్మెన్స్ కు చాలా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా విరూపాక్ష సక్సెస్ లో తన రోల్ చాలా ఉందని ప్రూవ్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లకు యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు దక్కట్లేదు.
కేవలం పాటలకు, గ్లామర్ కు మాత్రమే పరిమితమవుతున్న హీరోయిన్ రోల్స్‌కు భిన్నంగా కార్తీక్ దండు తనకు ఇచ్చిన అవకాశాన్ని ఓ ఛాలెంజ్ లా తీసుకుని, ప్రేక్షకుల్ని మెప్పించింది సంయుక్త. రీసెంట్గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సంయుక్త ఓ క్రేజీ ఆఫర్ ను కొట్టేసిందని తెలుస్తోంది. పుష్ప2 తర్వాత అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కలిసి చేయబోయే మూవీలో సంయుక్తను త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ లో భీమ్లా నాయక్, సార్ రూపంలో రెండు హిట్లు అందుకున్న సంయుక్త, రీసెంట్గా విరూపాక్ష కూడా ఈ బ్యానర్లోనే చేసింది. ఇప్పుడు బన్నీ సరసన నిజంగా ఓకే అయితే మాత్రం సంయుక్త కెరీర్‌కు ఆ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ ఈ సినిమా ఓకే అయినా సరే సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పడుతుంది.
బన్నీ పుష్ప2 కంప్లీట్ చేయడానికి ఈ సంవత్సరమంతా పడుతుంది. ఇటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమాను పూర్తి చేయడానికి టైమ్ పట్టనుంది. ఈ లోపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినా సరే ఈ సినిమా స్టార్ట్ అవడానికి టైమ్ అయితే పట్టనుంది. మరి ఫిల్మ్ నగర్ లో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.













