మరోసారి బన్నీతో బుట్టబొమ్మ మూవీ?
కెరీర్ స్టార్టింగ్ లో పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు తనకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ తో సినిమా చేయడంతో పూజా కెరీర్ ఒక్కసారిగా మారింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కాకపోయినా మంచి హిట్ నమోదు చేసుకోవడంతో పూజాకు తర్వాత ఛాన్సులు కూడా బాగా వచ్చాయి.
ఆ తర్వాత మరోసారి బన్నీతో కలిసి అల వైకుంఠపురములో సినిమాతో పూజా నటించింది. ఆ సినిమాలో వారిద్దరి జంటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బన్నీ- పూజా కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన సినిమాలో పూజాని హీరోయిన్ గా అనుకుంటున్నారట.
ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు కానీ దాదాపు ఓకే అవొచ్చంటున్నారు. ప్రస్తుతం పూజా ఫామ్ లో లేకపోయినా అట్లీ ఆ లెక్కలేమీ వేసుకోకుండా పూజాని తీసుకోవాలనుకుంటున్నాడట. హీరోయిజంని పీక్స్ లో చూపించే అట్లీ, హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యమిస్తాడు కాబట్టి పూజాని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే బన్నీ నుంచి ఈ విషయంలో ఎంత సపోర్ట్ ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండే అవకాశముంది.













