వామ్మో అనిపిస్తున్న అర్హ రెమ్యూనరేషన్
ఈ మధ్య స్టార్ కిడ్స్ నటించడం, ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్లు తీసుకోవడం ట్రెండ్‌గా మారింది. రీసెంట్గా మహేష్ కూతురు ఓ యాడ్ లో నటించి దానికి ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంది. ఆ రెమ్యూనరేషన్ ను ఓ ఛారిటీకి ఇచ్చి తండ్రికి తగ్గ కూతురని ఈ వయసులోనే అనిపించుకుంది సితార.
ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో స్టార్ కిడ్ కూడా జాయిన్ అయింది. బన్నీ ముద్దుల కూతురు అర్హకు ముందు నుంచే క్రేజ్ ఎక్కువ. రీసెంట్గా వచ్చిన శాకుంతలం సినిమాలో అర్హ నటించి అందరితో మెప్పు పొందింది. సినిమా హిట్ కాకపోయినా కేవలం అర్హ కోసం సినిమా చూసిన వాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా మొత్తంలో అర్హ ఉన్నంతసేపే సినిమా హైలైట్ అని కూడా అందరూ అనుకున్నారు.
శాకుంతలం తర్వాత అర్హ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో అర్హకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో అర్హ కనిపించనుందని, అర్హ క్యారెక్టర్ ఈ సినిమాలో 10 నిమిషాల పాటూ ఉండనుందని తెలుస్తోంది.
ఈ పది నిమిషాలకు అర్హకు ఏకంగా రూ.20 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అంటే నిమిషానికి 2 లక్షలు అన్నమాట. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే ఇక పెద్దయ్యాక హీరోయిన్ అయితే అల్లు హీరోయిన్ ఏ రేంజ్ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.













