పుష్ప2 కోసం అరవింద్ మెగా ప్లాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 షూటింగ్ దశలో ఉంది. ముందు అనుకున్నట్లైతే ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో పుష్ప2ను డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మీద, పుష్ప2 సినిమా మీద మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో వైసీపీకి చెందిన తన ఫ్రెండ్ కు బన్నీ సపోర్ట్ చేశాడనే కారణంతో మెగా ఫ్యాన్స్ అందరూ బన్నీపై కోప్పడ్డారు. ఇప్పుడదే ఇంపాక్ట్ పుష్ప2 మీద కూడా పడే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ గొడవలు జరుగుతుండటంతో దీన్ని ఇలానే చూస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ పుష్ప2 రిలీజ్ నాటికి ఇంకా ఎక్కువవుతుందని అల్లు అరవింద్ ఓ మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
పుష్ప2 సినిమాకు ఏదైనా ఈవెంట్ పెట్టి దానికి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకొచ్చేలా అరవింద్ ప్లాన్ చేస్తున్నాడట. బన్నీ, అల్లు అరవింద్ పిలిస్తే చిరూ కాదని చెప్పే ఛాన్స్ లేదు. చిరు పుష్ప2 ఈవెంట్ కు వస్తే ఈ గొడవ కూడా సద్దుమణుగుతుంది. కాబట్టి మెగాస్టార్ ను పుష్ప ఈవెంట్ కు పిలిచి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని అరవింద్ చూస్తున్నాడు.













