హీరోల రెమ్యూనరేషన్పై అల్లు అరవింద్ మాట
స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎప్పుడూ సెన్సేషనల్ టాపికే. సినిమా బడ్జెట్లో సగానికి పైగా స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కు రెమ్యూనరేషన్ గా ఇస్తుంటే, ఇక సినిమా నిర్మాణానికి నిర్మాతలు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారంటూ ఎంతో కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దాసరి నారాయణరావు ఉన్నప్పుడైతే హీరోలు, డైరెక్టర్లు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ చేసేవారు.
కానీ ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు. ఈ రోజుల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వామ్మో అనుకునే రేంజ్లో వారి రెమ్యూనరేషన్లున్నాయి. అందుకే ఆయా సినిమాల బడ్జెట్ కూడా ఆకాశాన్నంటుతుంది. ఇలా పెరగడానికి రీజన్.. స్టార్ హీరోల రెమ్యూనరేషనేనా అని అడిగితే అల్లు అర్జున్ కాదని ఒక్కమాటలో తేల్చేశాడు.
రీసెంట్ గా ఓ మీడియా సమావేశంలో గీతా ఆర్ట్స్ పెద్ద సినిమాలు ఎందుకు తీయడం లేదని ప్రశ్నించగా, ఆ సినిమాలకు పెద్ద మొత్తంలో ఖర్చవడమే రీజన్ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. అలా అని పెద్ద హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అని అంటే లేదని, సినిమా ఖర్చులో కేవలం 20-25% వరకు మాత్రమే హీరోలకు అందుతుందని, వారి రెమ్యూనరేషన్ వల్ల ఖర్చు పెరగట్లేదని, భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాల్లో స్టార్ హీరోలు నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.













