కామెడీ హీరో అనిపించుకునేకన్నా ఇదే బెటరనుకున్న అల్లరి నరేష్
రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా సెటిలైన ఏకైక హీరో అల్లరి నరేష్. 2002లో వచ్చిన ‘అల్లరి’ చిత్రం నుండి అల్లరి నరేష్ గా ఎన్నో హాస్య చిత్రాలలో కితకితలు పెట్టడం స్టార్ట్ చేసి… 2018లో వచ్చిన సిల్లీ ఫెలోస్ వరకు 16 ఏళ్లుగా నవ్విస్తూనే వున్నాడు. ఎంటర్టైన్మెంట్ మూవీలో నవ్వించడం అంత ఈజీ కాదు. గతంలో ఎంటర్టైన్మెంట్ అంటే… సినిమా ఒక్కటే అప్షన్. కానీ.. ప్రస్తుతం నవ్వుకోవడానికి దారులు పెరిగాయి సోషల్‌మీడియా.. కామెడీ షోస్‌లో కావాల్సినంత కామెడీ దొరుకుతోంది. ఈక్రమంలో నవ్వునే నమ్ముకున్న నరేష్‌కు కెరీర్ సాగించడం కష్టమైపోయింది. అందుకే.. కామెడీ నుంచి తప్పుకుని క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా యూ టర్న్ తీసుకున్నాడు. మరోసారి ఓ స్టార్‌తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుత పరిస్థుతులలో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎన్ని చేసినా.. ప్రేక్షకులకు నవ్వు .. నిర్మాతలకు డబ్బు రావడం లేదు. సుడిగాడు తర్వాత వరుసగా 13 ఫ్లాపులతో ఫేడౌట్ అయ్యాడు. మధ్యలో లడ్డుబాబు..ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అంటూ చేసిన ప్రయోగాలు కూడా బెడిసి కొట్టాయి. వరుస ఫ్లాపులు చవి చూసిన నరేష్‌ను మహర్షి చిత్రంలో సహా నటుడిగా కొత్తగా కనిపించదు. ఇందులో మహేశ్ ఫ్రెండ్‌గా ఇంపార్టెంట్ రోల్ లో నటించి … సినిమాకు ప్లస్ అయ్యాడు. హీరోయిజం కంటే.. క్యారెక్టరిజం బెటర్ అనే సత్యాన్ని మహర్షితో గ్రహించిన నరేష్ ప్రస్తుతం నాంది అనే ఎక్స్ పెరిమెంట్ మూవీ చేస్తున్నాడు.
నరేష్ మళ్లీ హీరోగా నటిస్తున్నాడన్న పేరేగానీ.. టీజర్లో తనదైన కామెడీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. మహర్షి నరేష్‌కు కొత్తదారి చూపించగా..బాలయ్య , బోయపాటి సినిమాలో మరోసారి ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ ఫిలిం వర్గాల్లో నడుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కోసం.. బాలయ్యతో కలిసి నటించే యంగ్ హీరో కోసం చాలామందిని అనుకున్నారు. ఆరోల్ అటు ఇటు తిరిగి నరేష్ దగ్గరకు వచ్చిందట. ఇలా పెద్ద హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయడం బెటర్ అన్న ఆలోచనలో నరేష్ కూడా వున్నాడు. డబ్బుకు డబ్బుకు.. కోకొల్లలుగా బిగ్ ప్రాజెక్ట్స్ లో బిజిగా ఆఫర్ లు వస్తాయని ఈ మార్గం ఎంచుకున్నాడని అనిపిస్తుంది. ఏది ఏమైనా అన్న రాజేష్ కన్నా బెటరు కదా!













