డిస్కో రాజా లో అతిథిగా అల్లరి
అల్లరి నరేశ్ హీరోగా చేసిన సినిమాలు ఇప్పుడు అంతగా విజయం సాధించలేకపోవడంతో సహాయక పాత్రలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మహర్షి చిత్రంలో మహేశ్‌కు స్నేహితుడిగానూ, క్లాస్మెంట్గానూ కీలక పాత్ర చేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మరో చిత్రంలో కనిపించబోతున్నారు. అదే రవితేజ హీరోగా చేస్తున్న డిస్కో రాజా. ఈ సినిమాలో ఈయన అతిథి పాత్రలో చేయబోతున్నారు. ఈ పాత్ర ఈయన కోసం రాయలేదు. కానీ మహర్షి చూశాక ఈ క్యారెక్టర్‌ను ఇతనితోనే చేయాలని ఈ సినిమా యూనిట్ భావించిందట. ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.













