బంగారు బుల్లోడు ఫస్ట్‌లుక్ విడుదల
అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగారు బుల్లోడు. నరేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నరేశ్ మాస్‌గా తయారై స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లుగా పోస్టర్లో చూపించారు. ఉగాదికి సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రానికి పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మిస్తున్నారు. పూజా ఝవేరీ కథానాయిక. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్‌లో విడుదలైన మహర్షి చిత్రంలో నరేశ్‌కు మంచి పాత్ర దక్కింది.













