మరోసారి వివాదాల్లో ఆదిపురుష్
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ ఆది పురుష్. టి సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొదట్లో ముంబైలో షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో సెట్ లో అగ్ని ప్రమాదంతో వార్తల్లోకెక్కిన ఆది పురుష్ ఇప్పటికీ ఏదో వివాదంలో నిలుస్తూనే ఉంటుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్ర పోషిస్తుంది.
రామాయణ ది లార్డ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే జపనీస్ యానిమేషన్ మూవీ స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం విఎఫెక్స్ వర్స్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ని రీసెంట్గా రిలీజ్ చేయడం, ఆ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీరాముడిగా ప్రభాస్ ని చూపించిన తీరు, హనుమంతుడి మేకోవర్.. ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాపై వెల్లువెత్తిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి.
దీంతో చిత్ర యూనిట్ గ్రాఫిక్స్ వర్క్స్ కోసం మరో 100 కోట్లు కేటాయించి మరీ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదిపురుష్ టీజర్‌ని ఎలాంటి సెన్సార్ లేకుండా ప్రదర్శించారని కుల్దీప్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అంతేకాకుండా సీతాదేవి క్యారెక్టర్లో నటించిన కృతి సనన్ వస్త్ర అలంకరణపైనా కుల్దీప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాతు. కుల్దీప్ వేసిన పిటిషన్‌ను స్వీకరించిన అలహాబాద్ కోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.













