వకీల్ సాబ్ సక్సెస్ తో ఆ ముగ్గురూ సూపర్ హ్యాపీస్..
అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి వకీల్ సాబ్ కు చాలా మంచి ఆదరణ వస్తుంది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ను ముఖ్యంగా చర్చించినందుకు ఈ సినిమాను అందరూ అభినందిస్తున్నారు. దీంతో సినిమా యూనిట్ అంతా అమితానందంలో ఉంది. వకీల్ సాబ్ ముగ్గురు యువతుల చుట్టూ తిరిగే కథ అన్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురి యువతుల పాత్రల్లో నివేదా, అంజలి, అనన్య లు నటించారు.
అయితే ఈ ముగ్గురూ ఇప్పుడు వకీల్ సాబ్ సక్సెస్ ఇచ్చిన ఆనందంతో ఉబ్బితబ్బుబ్బయిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి అంజలి పరిచయమై చాలా కాలమే అయింది. హీరోయిన్ గా కెరీర్ ను మొదలెట్టి, ఐటెమ్ గర్ల్ వరకూ అన్నీ పాత్రలను చేసుకుంటూ వచ్చింది కానీ ఇండస్ట్రీలో మాత్రం టాప్ హీరోయిన్ గా నిలబడలేకపోయింది. దానికి కారణం తనకు సరైన సక్సెస్ దక్కకపోవడమే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందరినీ ఆకట్టుకున్న అంజలికి ఆ తర్వాత అన్నీ ఎదురుదెబ్బలే తాకాయి.
తన పాత్రకు ప్రాముఖ్యత ఉండే పాత్రలే ఎంచుకునే నటిగా పేరు పొందిన నివేదా థామస్ కు గతేడాది వచ్చిన వి సినిమా ఘోర పరాజయాన్ని మిగిల్చింది. దీంతో తర్వాత వచ్చిన వకీల్ సాబ్ మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఇక రీసెంట్ గా మల్లేశం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన అనన్య కు కూడా ఈ సినిమా సక్సెస్ మంచి బూస్టప్ ను ఇచ్చింది. ఈ సినిమా పై ముగ్గురు భామలూ ఎన్నో ఆశలు పెట్టుకుని, బౌన్స్ బ్యాక్ అవాలని చూశారు. అనుకున్నట్లుగానే సినిమా సక్సెస్ కావడంతో ముగ్గురూ ఎంతో ఆనందంగా ఉన్నారట. ఈ సినిమా సక్సెస్ ముగ్గురికీ ఎలాంటి అవకాశాల్ని తెచ్చిపెడుతుందో చూడాలి.













