Prabhas: ఓ సినిమా వల్ల అన్నీ ఆలస్యాలే
ఇండస్ట్రీలో ఓ సినిమా వల్ల మరెన్నో సినిమాలు లేటవుతూ ఉంటాయి. ఓ సినిమా లేటైతే దాని ప్రభావం మిగిలిన సినిమాలపై పడటం సహజం. ప్రభాస్(prabhas) చేస్తున్న సినిమాలన్నీ ఇదే ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్, మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab), హను రాఘవపూడి(Hanu raghavapudi)తో ఫౌజీ(Fauji) సినిమాలను ఒకేసారి చేస్తున్నాడు.
మధ్యలో కొన్ని కారణాలతో రాజా సాబ్ లేటవడంతో ఫౌజీ సినిమా ఆలస్యమైంది. దీంతో సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) తో చేయాల్సిన స్పిరిట్(spirit) కూడా లేటవుతూ వస్తుంది. అయితే మిగిలిన సినిమాల్లాగా కాకుండా ప్రభాస్ కేవలం స్పిరిట్ కోసమే డేట్స్ కేటాయించాలని భావిస్తున్న సందీప్ రెడ్డి, ఆ సినిమా కోసం బల్క్ లో డేట్స్ ను ఇవ్వాలని కోరగా, ప్రభాస్ కూడా దానికి ఓకే అన్నాడు.
స్పిరిట్ కు బల్క్ లో డేట్స్ ను కేటాయించడం వల్ల ఆ ఎఫెక్ట్ కల్కి2(Kalki2) పై పడుతుంది. ఆల్రెడీ కల్కి2 స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలవగా, ఇప్పుడా సినిమా వాయిదా పడింది. ప్రభాస్ మరో ఏడాది పాటూ బిజీగా ఉండటం వల్ల కల్కి2 సెట్స్ పైకి వెళ్లే వీల్లేదు. కమల్(kamal), అమితాబ్(amithab) తో ముందుగా షూటింగ్ ను పూర్తి చేసి, ఆ తర్వాత ప్రభాస్ తో సినిమాను చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వారిద్దరూ కూడా కల్కి2 కోసం కేటాయించిన డేట్స్ ను వేరే ప్రాజెక్టులను అడ్జస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ తిరిగి కల్కి2 కోసం డేట్స్ ను ఇచ్చినప్పుడు వారి డేట్స్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ లోగా నాగ్ అశ్విన్(nag ashwin) మరో సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.







