సెట్స్ లోనే నవ్వులు పూయిస్తున్న వెంకీ
వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(anil ravipudi) కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. నవంబర్ లోపు సినిమా మొత్తాన్ని పూర్తి చేసి డిసెంబర్ కు ఫస్ట్ కాపీని రెడీ చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. బడ్జెట్ కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో కమర్షియల్ అంశాల కంటే కామెడీ కీలక పాత్ర పోషిస్తుందని యూనిట్ సభ్యులంటున్నారు.
ఎఫ్2(F2), ఎఫ్3(F3) సినిమాల్లో ఇతర ఆర్టిస్టులన్నప్పటికీ వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరుని ఫ్యాన్స్ మర్చిపోలేరు. వరుణ్ తేజ్(varun Tej) హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76(venky76)లో అలాంటి స్కోప్ లేకపోవడంతో ఇప్పుడు మొత్తం భారం వెంకటేష్ పైనే ఉంది. సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వుతున్నారట.
అయితే ఈ సినిమాకు ముందుగా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ను అనుకున్న విషయం తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజ్ కదా అని దీన్ని లాక్ చేసుకుందామనుకున్నారు కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లే.













