అన్స్టాపబుల్ సీజన్3 కు రంగం సిద్ధం
హీరోగానే కాదు హోస్ట్ గా కూడా నందమూరి బాలకృష్ణ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. బాలయ్య హోస్ట్ గా వచ్చిన అన్స్టాపబుల్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. సెకండ్ సిరీస్లో పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువైందని కంప్లైంట్ రావడంతో ఈసారి సినీ సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న కాంబినేషన్స్ మూడో సీజన్ లో సాధ్యమవనున్నాయని ఇన్సైడ్ టాక్. అందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి కాగా రెండోది అక్కినేని నాగార్జున. వెంకటేష్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఓకే అనగానే కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తోంది. వీరిద్దరితో బాలయ్యకు చాలా కాలంగా మనస్పర్థలున్నాయని వస్తున్న వార్తలు ఈ రియాలిటీ షోతో తొలగిపోనున్నాయని బాలయ్య సన్నిహితులంటున్నారు.
అంతేకాదు మూడో సీజన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే అన్స్టాపబుల్ సీజన్3 కు అంచనాలు సినిమాల కంటే ఎక్కువగానే ఉండేట్లున్నాయి. దసరా నుంచి సీజన్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఈసారి సీజన్3 మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుందనేది మాత్రం తెలుస్తోంది.













