అన్‌స్టాపబుల్ సీజన్-3కి సర్వం సిద్ధం
హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా దుమ్ము లేపాడు. అన్‌స్టాపబుల్ షో ద్వారా ఆయన సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సెలబ్రిటీ టాక్ షో రికార్డులను క్రియేట్ చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చంద్రబాబు లాంటి స్టార్స్ తో ఈ షో రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది.
ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 3 కోసం మేకర్స్ గట్టిగా ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దానికితోడు రీసెంట్గా అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబును బయటకు తీసుకురావాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితమే ఈ అన్‌స్టాపబుల్ సీజన్3 త్వరలోనే ప్రారంభం కానుందని నెట్టింట వార్తలొచ్చాయి. ఈ షో కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈసారి సీజన్3ని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, కేటీఆర్, వెంకటేష్ లాంటి వారిని గెస్టులుగా తీసుకొస్తారని టాక్ నడిచింది కానీ అవేమీ జరిగేట్లు కనిపించట్లేదు.
ఈ సీజన్3కి భగవంత్ కేసరి చిత్ర యూనిట్, మంత్రి కేటీఆర్ వచ్చే ఛాన్సులున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్స్‌కు బాలయ్య డేట్స్ ఇవ్వడమే లేట్ అని టాక్. బాలయ్య డేట్స్ అడ్జస్ట్ చేస్తే వెంటనే ఈ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.













