సలార్-2కు ముహూర్తం కుదిరినట్లేనా?
సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్2 రానున్న విషయం తెలిసిందే. సలార్-2ను 15 నెలల్లోపు కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ ఇప్పటికే ఫ్యాన్స్ కు మాటిచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో మేకర్స్ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సలార్-2 సినిమాకు ముహూర్తం కుదిరినట్లు కనిపిస్తోంది. జులైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. దాని కంటే ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులై అంటే అప్పటికి సమ్మర్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఎండల ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా షూటింగ్ ను పూర్తి చేయొచ్చు.
సలార్-2 షూటింగ్ కూడా మొత్తం సెట్స్ లోనే చేయాల్సి ఉంటుంది. సమ్మర్ లో చేయాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఇలా అన్ని రకాలుగా చూసుకుని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కథలో అవసరమైన మార్పులు కూడా పూర్తయ్యాయట. సలార్ తో మిస్ అయిన రూ.1000 కోట్ల మార్క్ ను సలార్-2తో సెట చేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడట.













