మోక్షజ్ఞ అరంగేట్రానికి ఆల్ క్లియర్
నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నది మోక్షజ్ఞ ఎంట్రీ గురించి. ఎప్పుడో మోక్షు ఎంట్రీ ఉండాల్సింది కానీ ఇప్పటికీ అది జరగలేదు. అతి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్టర్లు రావడమే ఇందుకు కారణం.
ఇన్నేళ్లలో ఎప్పుడూ మోక్షజ్ఞ బర్త్ డే కి ఇలా పోస్టర్లతో విషెస్ చెప్పని నిర్మాణ సంస్థలు ఇలా సోషల్ మీడియా సాక్షిగా విషెస్ తెలపడం అంటే వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండాలా అనే దానిపై బాలయ్య మనసులో ఏముందో ఇప్పటికీ తెలియడం లేదు. కొడుకు ఎంట్రీ కోసం తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు బాలయ్య ఓకే అంటూ మాటిచ్చేస్తున్నాడు.
ఇదంతా చూస్తుంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఆఖర్లో లేదంటే వచ్చే ఏడాది ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. కాకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ ఆదిత్య 999 తో ఉంటుందా లేక మరేదైనా కొత్త కథతో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఏ సినిమా అయినా సరే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.













