Alia Bhatt: సెక్రటరీ చేతిలో ఓడిపోయిన ఆలియా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఎంత సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. అంతటి టాలెంటెడ్ హీరోయిన్ తన మాజీ సెక్రటరీ చేతిలో దారుణంగా మోసపోయారు. ఆలియా మాజీ సెక్రటరీ వేదికా శెట్టి(Vedika Shetty)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ బిల్స్ ను రెడీ చేసినందుకు గానూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మే 2022 నుంచి ఆగస్ట్ 2024 మధ్య వేదికా, రూ.76 లక్షల విలువ గల బిల్స్ పై సంతకాలు తీసుకుని వాటిని తన క్లోజ్ ఫ్రెండ్స్ అకౌంట్స్ లోకి బదిలీ చేశారు. ఈ రెండేళ్ల వ్యవధిలో నేహాశెట్టి రూ.76 లక్షల నిధులను దుర్వినియోగం చేయగా ఈ విషయంపై ఆలియా భట్ టీమ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో కేసు నమోదు చేసింది. కేసు నమోదైనప్పటి నుంచి వేదిక పరారీలో ఉన్నారు.
మొత్తానికి 5 నెలల తర్వాత వేదికా బెంగుళూరు లో పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వేదికాను కోర్టులో హాజరు పరిచా ఆ తర్వాత కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ విషయంలో దర్యాప్తుకొనసాగుతుండగా, వేదికతో పాటూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇతర వ్యక్తులపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్ని ఆలియా ఫ్యాన్స్ అంత తెలివి ఉండి ఆలియా ఎలా మోసపోయిందని జాలి చూపిస్తున్నారు.