ఆ రూమర్లకు బాధ పడిన ఆలియా భట్
సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక ఫిల్మ్ సెలబ్రిటీల గురించి బాగా రూమర్లు ఎక్కువయ్యాయి. ప్రతీదీ ఇలానట, అలానట అని ఏదొకటి క్రియేట్ చేస్తూనే ఉన్నారు జనాలు. వాటన్నింటినీ పట్టించుకుంటే బాధ పడటం తప్పించి మరో ప్రయోజనం ఉండదు. కానీ వ్యక్తిగత విషయాలను అస్తమానం టార్గెట్ చేస్తే మాత్రం బాధ తప్పదు.
ఈ విషయంలో ఆలియా భట్ తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడినట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణ్బీర్ కపూర్ తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని ఆమె వెల్లడించింది. గతంలో కాఫీ విత్ కరణ్ షో లో ఆలియా, రణ్ బీర్ కు తాను లిప్ లాక్ చేస్తే నచ్చదని చెప్పింది.
దాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని ఆలియాను రణ్బీర్ వేధిస్తున్నాడంటూ వార్తలు రాశారని, ఆ విషయం తననెంతో బాధించిందని చెప్పుకొచ్చింది. రణ్బీర్ చాలా మంచి వ్యక్తి అని, తననెంతో అపురూపంగా చూసుకుంటాడని ఆలియా వెల్లడించింది. ఈ ఒక్క విషయంలోనే కాదని, తన పెళ్లి జీవితంలో చాలా సమస్యలునున్నట్లు కూడా చాలాసార్లు రూమర్స్ క్రియేట్ చేశారని, ఒకప్పుడు వాటిని చూసి బాధ పడ్డానని, తర్వాత పట్టించుకోవడమే మానేశనని ఆలియా తెలిపింది. ప్రెజెంట్ కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఎన్ని రూమర్లు వచ్చినా వాటిని హార్ట్ కు తీసుకోకుండా ముందుకు వెళ్లాల్సిందేనని ఆలియా అభిప్రాయపడింది.













