Alia Bhatt: కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసిన ఆలియా
తమ పిల్లల విషయంలో సెలబ్రిటీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అన్నీ విషయాలను రహస్యంగా ఉంచుతూ ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా వారి ప్రైవసీకి భంగం కలుగుతుందోమేననే కారణంతో వారి వివరాలేమీ బయటకు రానీయకుండా జాగ్రత్త పడతారు. కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఆలియా భట్(Alia Bhatt) మాత్రం తన కూతురు రాహా(Raaha)ని అందరికీ పరిచయం చేసింది.
ముందు సంవత్సరం పాటూ తమ కూతురిని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడిన రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియా భట్ ఆ తర్వాత నుంచి మాత్రం కూతురి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆలియా తన కూతురు రాహా ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.
రాహా ఫేస్ కనిపించని ఒకట్రెండు ఫోటోలు తప్ప మిగిలిన అన్ని ఫోటోలను ఆలియా తన సోషల్ మీడియా నుంచి తీసేసింది. కాగా ఆలియా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమెకు మద్దతిస్తున్నారు నెటిజన్లు. కూతురి సేఫ్టీ కోసం తల్లిగా ఆలియా మంచి డెసిషనే తీసుకుందని ఆలియాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ఓ సందర్భంలో కూడా ఆలియా తన కూతురు ఫోటోలు తీయొద్దని ఫోటోగ్రాఫర్లకు సూచించిన విషయం తెలిసిందే.













