Alia Bhatt: యువరాణిలా మెరిసిపోతున్న ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) తన తాజా ఫోటో షూట్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోల్లో తను సెలెక్ట్ చేసుకున్న డిజైనర్ లుక్ అందరి కళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. గోల్డ్ కలర్ గౌన్, థై స్లిట్ ఫ్రాక్, హెవీ లెహంగా ధరించి రాయల్ లుక్ లో ఓ యువరాణిలా కనిపిస్తోంది. ఆలియా ధరించిన వాటిలో జరీ ఎంబ్రాడయిరీ, షిమ్మరీ మెరుపుల అలంకరణలు ప్రతీదీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షిస్తున్నాయి. ఆలియా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతుండగా, ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోలకు దేశీ సిండ్రెల్లా అని కామెంట్స్ చేస్తున్నారు.













