అల..వైకుంఠపురములో తమిళంలో రీమేక్!
అల్లు అర్జున, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొంది. బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది. అలాగే కాసుల వర్షమూ కురిపించింది. ఇప్పుడీ చిత్రాన్ని శివ కార్తికేయన్ కథనాయకుడిగా తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. రెమో చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన సైన్స్ ఫిక్షన్ అయలాన్ చిత్రంలో నటిస్తున్నారు. రవిశంకర్ దర్శకత్వం వహిస్త్ను ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథనాయికగా నటిస్తోంది.













