11న అల వైకుంఠపురంలో టీజర్
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం అల.. వైకుంఠపురంలో. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్కిది 19 వ చిత్రం. నాయికగా పూజాహెగ్డే నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. కాగా చిత్ర టీజర్‌ను ఈనెల 11న విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, సెంటిమెంట్ అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయని నిర్మాతలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో మరో మైలురాయిలా నిలుస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్.













