అలవైకుంఠపురంలో టబు ఫస్ట్ లుక్
నిన్నే పెళ్లాడతా లో పండుగా మెప్పించిన నటి టబు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. మధ్యలో కొంత గ్యాప్. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్లోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అల వైకుంఠపురము లో నటిస్తోంది. అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటిస్తోందని తెలిసింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. తెలుగులో కూలి నెంబర్ వన్‌తో కెరీర్ ప్రారంభించిన టబు ఆ తర్వాత సిసింద్రి, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, చెన్నకేశవరెడ్డి, పాండురంగమహత్యం, ఇదీ సంగతి తదితర చిత్రాల్లో నటించింది.













