జయలలిత బయోపిక్ కు టైటిల్ ఖరారు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ.ఎల్.విజయన్ దర్శకత్వంలో ఓ బయోపిక్ తెరకక్కనుంది. ఈ చిత్రానికి తలైవి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనన్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతాన్ని అందించనుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలాఉండగా జయలలిత జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని మరో బయోపిక్‌ను తెరకెక్కిస్తోంది. ది ఐరన్ లేడి అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది.













