నోటీసులు అందుకున్నవారు విచారణకు రావాల్సిందే
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సంబంధించిన కొంతమందికి విచారణ నిమిత్తం నోటీసులు ఇచ్చినట్లు అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నోటీసులు అందుకున్నవారందరూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సెక్షన్ 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేయడం జరిగిందని చెప్పారు. ఇవాళ ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని అన్నారు. నోటీసులు జారీ చేసినవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కేటాయించడం జరిగిందని, ఆ రోజు వాళ్లు రావాలని అన్నారు. మీడియాలో రకరకాలు వస్తున్నాయని, తాము ఎవరి పేర్లు వెల్లడించలేదని, కాలేజీ విద్యార్థుల కేసులో కూడా పేర్లు వెల్లడించలేదని, అదే మాదిరిగా టాలీవుడ్ నటులకు సంబంధంచి కూడా పేర్లు వెల్లడించలేదని సృష్టం చేశారు. నోటీసులు అందుకున్నవారు విచారణకు సహకరించాలని ఆయన మీడియా ద్వారా కోరారు. రాని పక్షంలో చట్టపంరగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అరెస్టులు లాంటివి ఏమీ ఉండవని అన్నారు. ఈ కేసుకు సబంధించి ఇప్పటివరకు 13 మంది అరెస్టు చేశామని తెలిపారు.













