అక్షయ్ పై మండిపడుతున్న నెటిజన్లు..
బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. సినిమా హిట్టా ఫట్టా అనేదానితో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తుంటాడు ఈ బాలీవుడ్ హీరో. గత ఏడాది అక్షయ్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయినా కూడా ఎక్కడా తగ్గేదేలేదంటూ తన తదుపరి ప్రాజెక్ట్స్ మీద ఈ హీరో దృష్టి పెట్టాడు. తెలుగులో రిలీజైన రాక్షసుడు మూవీ ని హిందీలో కట్ పుత్లీగా రీమేక్ చేయగా ఈ సినిమా కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజై పర్వాలేదన్పించుకుంది ఈ సినిమా.
రీసెంట్ గా అక్షయ్ కుమార్ నార్త్ అమెరికా టూర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టూర్ ప్లాన్ చేసినప్పటినుండి అక్షయ్ ఏదోక రకంగా వార్తల్లో నిలుస్తుండడం విశేషం. ఈ నార్త్ అమెరికా టూర్ లో దిశా పటాని, నోరా ఫతేహ్, మౌని రాయ్ వంటి బాలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్రమోషన్స్ కోసం ఒక వీడియోని షూట్ చేసారు అక్షయ్ అండ్ టీం. ఇప్పుడు ఈ వీడియో తో మరోసారి ఈ బాలీవుడ్ హీరో వార్తల్లోకి వచ్చి నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యాడు.
అసలు విషయంలోకి వెళ్తే, అక్షయ్ కుమార్ స్టార్ట్ చేసిన నార్త్ అమెరికా టూర్ కోసం ప్రమోషనల్ వీడియో రీసెంట్ గా షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో లో అక్షయ్ కుమార్ గ్లోబ్ పైన షూ వేసుకొని నడుస్తున్న పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దేశ పటాల ల మీద అలా షూస్ వేసుకొని నడవడం ఎంత వరకు కరెక్ట్ అని ఇప్పుడు ప్రజలు అక్షయ్ ని ప్రశ్నిస్తున్నారు. దేశంపై భక్తి ఉంటె ఇలానేనా ప్రవర్తించేది అని ఈ బాలీవుడ్ హీరోపై మండిపడుతున్నారు. నెట్టింట ఈ విషయంపై ఇంత చర్చ జరుగుతున్నా ఇప్పటివరకు అక్షయ్ కుమార్ ఈ ట్వీట్ ని డిలీట్ చేయకపోవడంతో ఆడియన్స్ మరింత ఫైర్ అవుతున్నారు.













