ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్‌కు స్థానం
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాను ప్రకటించింది. హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ మొదటి స్థానంలో నిలవగా, అక్షయ్ నాలుగో స్థానంలో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జూన్ 1 నుంచి 2019 జూన్ 1 వరకు నటుడు డ్వేన్ 89 మిలియన్ డాలర్లు సంపాదించినట్టు ఫోర్బ్స్ తెలిపింది. మరో ఆస్ట్రేలియన్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ రెండో స్థానం దక్కించుకున్నారు. 65 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానం దక్కించుకున్న అక్షయ్‌కుమార్ ప్రతి రూపాయి కోసం ఎంతో కష్టపడుతున్నాను అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.













