కత్తి రీమేక్ లో అక్షయ్ కుమార్ ?
దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలు హిందీలో రీమేకై ఘన విజయం సాధిస్తున్నాయి. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి అక్కడ కబీర్‌సింగ్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇక్కడి చిత్రాలపై బాలీవుడ్ హీరోలకు మరింత మోజు పెరిగింది. విజయ్ నటించిన తమిళ చిత్రం కత్తి ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అక్షయ్ కుమార్ నటించనున్నట్లు సమాచారం. జగన్ శక్తి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అక్షయ్- జగన్ కలయికలతో మిషన్ మంగళ్ తెరకెక్కింది. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నా రెండో చిత్రంగా సందేశం నిండిన యాక్షన్ చిత్రం చేయాలనుకుంటున్నాను అని చెబుతున్నారు జగన్ శక్తి.













