తుఫాను బాధితులకు రూ. కోటి విరాళం
ఫోణి తుఫాన్ బీభత్సవం కారణంగా ఒడిస్సాలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయిన విషయం విదితమే. ఇప్పటికే ఒడిసా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వరద బాధితులకు అండగా పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడ తమవంతుగా ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా అక్షయ్‌కుమార్ తన వంతుగా రూ.కోటిని విరాళంగా ప్రకటించారు. అక్షయ్ ఇప్పటికే ఒడిసా సీఎం సహాయనిధికి తన విరాళాన్ని అందజేసినట్లు తెలిసింది. ఇక అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటనతో మిగిలిన స్టార్ హీరోలు సైతం తమవంతుగా విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.













