అక్షయ్ కుమార్ రూ.కోటి విరాళం

బాలీవుడ్ నటుడు అక్షయ్‍కుమార్ జమ్ముకశ్మీర్‍లోని నియంత్రణ రేఖ దగ్గర ఉన్న బందీపుర జిల్లా తులైల్ గ్రామానికి వెళ్లాడు. అక్కడి స్థానికులు, భద్రత బలగాలతో మాట్లాడారు. అక్కడ ఓ స్కూలు నిర్మాణం కోసం రూ.కోటి విరాళం ఇచ్చిన తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అక్షయ్‍కుమార్ వస్తున్నాడని తెలియడంతో అక్కడి ఆర్మీ జవాన్లు, బీఎస్‍ఎఫ్ బలగాలు సంతోషంగా ఆహ్వానించారు. వాళ్లతో కలిసి అక్కడ చాలా సేపు మాట్లాడారు. స్థానికులతో కలిసి అక్షయ్ డ్యాన్స్ కూడా చేశాడు. తన ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. నిజమైన హీరోలను కలవడం సంతోషంగా ఉందన్నారు.