బెల్‌బాటమ్ ఫస్ట్‌లుక్ విడుదల
అక్షయ్‌కుమార్ తన స్టైల్‌ను మార్చారు. 1980ల కాలం నాటి బెల్‌బాటమ్ ట్రెండ్‌లోకి మారిపోయారు. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా బెల్‌బాటమ్ పేరుతో హిందీలో ఓ సినిమా రూపొందనున్నది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకున్నది. ఈ పోస్టర్లో 1980ల కాలం నాటి బెల్‌బాటమ్ శైలి వస్త్రధారణతో రెట్రో లుక్‌లో అక్షయ్‌కుమార్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 2021 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కన్నడంలో రూపొందిన బెల్‌బాటమ్ చిత్రానికి రీమేక్ ఇదని వార్తలు వచ్చాయి. అక్షయ్‌కుమార్ వాటిని ఖండించారు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని ప్రకటించారు.













