అక్షర టీజర్‌ను విడుదల చేసిన అనిల్ రావిపూడి
నందితా శ్వేతా ప్రధానపాత్రలో బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం అక్షర. ఈ మూవీ టీజర్‌ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఒక సీరియస్ పాయింట్‌ను తీసుకుని ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా రూపొందిన చిత్రమిది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. కార్యక్రమంలో దర్శకుడు బి.చిన్నికృష్ణ, షకలక శంకర్, శ్రీతేజ్, నందితా శ్వేత, నిర్మాత సురేష్ వర్మ, శివశంకర్ మాస్టార్, మధుర శ్రీధర్ తదితరులు మాట్లాడారు.













