ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న నాగ్
అక్కినేని నాగార్జున నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది కానీ ఆయన తన తర్వాతి సినిమాను ఇంకా మొదలుపెట్టలేదు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ మలయాళం రీమేక్ పోరింజు మరియం జోస్ అనే సినిమాను తన తర్వాతి సినిమాగా ప్లాన్ చేసుకున్న నాగ్, ఇప్పటి వరకు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు.
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తైనప్పటికీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నాగ్ సందిగ్ధంలో ఉన్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఫైనల్ వెర్షన్ బాగానే వచ్చినప్పటికీ కథలో ఉన్న ఎలిమెంట్స్ ను ప్రసన్న ఎంత వరకు హ్యాండిల్ చేయగలడు అని నాగ్ ఆలోచిస్తున్నాడట. ఈ విషయంలోనే సినిమాను సెట్స్ కు తీసుకెళ్లకుండా పెండింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరుకి ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కినేని హీరోలకు వరుసగా డిజాస్టర్లు పడటంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నాగ్, ఈ సినిమా విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారని టాక్. ప్రస్తుతం నాగ్ మెయిన్టెయిన్ చేస్తున్న గడ్డం లుక్ కూడా ప్రసన్న కుమార్ మూవీ కోసమే.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనున్న ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతుందని టాక్. ఇప్పటికే ఈ మూవీలో సెకండ్ హీరో కోసం అల్లరి నరేష్ ను లాక్ చేసుకున్నారు. నాగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే ఆర్టిస్టుల డేట్స్ లాక్ చేయనున్నాడు ప్రసన్న. అంతేకాదు ఈ మూవీకి ఎంతో ముఖ్యమైన హీరోయిన్ పాత్ర కోసం ఇంకా ఎవరూ ఫిక్స్ అవలేదు. మరి ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చేదెప్పుడో?













