చైతూ రెండో పెళ్లికి నాగ్ కసరత్తులు
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఈ మధ్య నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. ఆ మధ్యన ఓ నటితో విదేశీ రెస్టారెంట్ లో కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి కానీ ఈ వార్తలపై ఇటు చైతూ కానీ, అటు అక్కినేని ఫ్యామిలీ కానీ ఏరోజూ స్పందించలేదు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా ఈ మ్యాటర్ సైలెంట్ అయింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం చైతూ పెళ్లి బాధ్యతను ఈ సారి తండ్రి నాగార్జున తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం నుంచి సంబంధం తీసుకొచ్చి, చైతూకు ముడి వేయాలని చూస్తున్నాడట నాగార్జున.
మరి చైతన్య మనసులో ఏముంది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. చైతూ మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్పైన, తన సినిమాలపైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెరీర్ లో సక్సెస్ లు లేక బాగా వెనుకపడిపోయిన చైతూ తన తర్వాతి సినిమాపైనే ఇప్పుడు దృష్టంతా పెట్టినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో చైతూ తన తర్వాతి సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.













