అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాని 2022 ..!
2022 అక్కినేని హీరోలకు అసలు కలిసి రాలేదని చెప్పొచ్చు. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే నాగార్జున, నాగ చైతన్య కలిసి బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నా, 2022 మొత్తం వారికి పెద్దగా కలిసి వచ్చినట్లు ఏమి అనిపించలేదు. బంగార్రాజు సినిమా తర్వాత నాగ చైతన్య “థ్యాంక్ యు” సినిమాతో థియేటర్లలో సందడి చేసాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇక ఈ ఇయర్ లోనే నాగార్జున “ది ఘోస్ట్” అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇవే కాకుండా నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ గా చేశారు. జరిగిన బిగ్ బాస్ ఐదారు సీజన్ లలో ఈ సీజనే చాలా తక్కువ టి.ఆర్.పితో రన్ అయ్యింది. ఈ సీజన్ జరుగుతున్నప్పుడు కూడా ఏమంత హడావిడిగా అనిపించలేదు. బిగ్ బాస్ ద్వారా కూడా నాగార్జునకు నిరాశ తప్పలేదు.
ఇటు నాగ్, అటు చెయ్ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు హీరో అఖిల్ కి ఈ ఏడాది మొత్తం “ఏజెంట్” షూటింగ్ తోనే సరిపోయింది. ఈ సినిమా 2022 చివర్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అది కుదరలేదు. రీ షూట్ లతోనే కాలం గడిచిపోయింది. సినిమా క్వాలిటీ పరంగా పర్ఫెక్ట్ గా రావాలని చిత్ర యూనిట్ రీ షూట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా మీదే ప్రస్తుతం అఖి ఆశలు పెట్టుకున్నాడు.
అఖిల్ ఏజెంట్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది అనుకున్న తరుణంలో, అది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా 2022 మొత్తం అక్కినేని హీరోలకు ఏమాత్రం కలిసి రాలేదు. 2023 అయినా అక్కినేని హీరోలకి హిట్స్ ని ఇస్తుందో లేదో అనేది వేచి చూడాల్సిందే.













