అక్కినేని ఫ్యామిలీకి ఇంగ్లీష్ టైటిల్స్ పిచ్చి
టైటిల్స్ ప్రభావం సినిమాకు బజ్ తీసుకురావడంలో చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఎంపికలో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. సినిమాలో కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద టైటిల్స్ పెట్టినా సరే అవేమీ ఎఫెక్ట్ చూపించవు. కానీ ఇంగ్లీష్ టైటిల్స్ మాత్రం సినిమాకు కాస్త డేంజర్ అనే చెప్పాలి. ఇలాంటి టైటిల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ టైటిల్స్ మీద చాలా మోజు అనే చెప్పాలి. వాటి వల్ల సగం మాస్, రిలీజ్ రోజు థియేటర్లకు రాకుండా పోతున్నారు. రీసెంట్గా రిలీజైన కస్టడీకి మరీ అన్యాయంగా మూడు కోట్ల షేర్ కూడా రాలేదు. తమిళనాడులో అయితే దారుణంగా 20 లక్షలే కలెక్ట్ చేసింది. గతేడాది వచ్చిన చైతూ సినిమా థాంక్యూ కూడా ఇదే రిజల్ట్ ని అందుకుంది.
అఖిల్ ఏజెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాగార్జున వైల్డ్ డాగ్, ఆఫీసర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. అక్కినేని ఫ్యామిలీకి తెలుగులో మంచి టైటిల్స్ పెట్టుకున్న మనం, బంగార్రాజు, మజిలీ సినిమాలు ఎంత పెద్ద హిట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఫ్లాప్ అవుతాయని కాదు. ఏదో అప్పుడప్పుడు ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ అయితే బాగుంటాయి కానీ ఇలా ప్రతి సినిమాకు ఇంగ్లీష్ లోనే టైటిల్స్ పెట్టడమెందుకని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కస్టడీకి సినిమాకు ఈ టైటిల్‌కు బదులు ముందుగా అనుకున్న శివ అనే టైటిల్ ను పెట్టి ఉంటే డే1 కలెక్షన్స్‌లో ఇంకాస్త మార్పు ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.













