అక్కినేని హీరోలు ఈ సారైనా సాధిస్తారా?
ఏ హీరోకైనా కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే మాస్ ఇమేజ్ ఇంపార్టెంట్. ఎంత క్లాస్ సినిమాలు తీసినా, మాస్ సినిమాలతో అప్పుడప్పుడైనా ఆడియన్స్‌ను పలకరిస్తుంటేనే మార్కెట్లో వారి క్రేజ్ పెరిగుతుంది. అందుకే ఏ హీరో అయినా సరే ఆ ఇమేజ్ కోసం పరితపిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోలు కూడా మాస్ హీరో అనిపించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు.
అక్కినేని వారసులుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నాగచైతన్య, అఖిల్ తమకంటూ స్పెషల్ ఇమేజ్ ఉండాలని బాగా కష్టపడుతున్నారు. కెరీర్ మొదలైన దగ్గర నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై అయితే చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు వర్కౌట్ మాత్రం అవలేదు. అక్కినేని హీరోలకు క్లాస్ లవ్ స్టోరీలే హిట్స్ అందించాయి.
జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చైతన్య, ఏమాయ చేసావే లాంటి క్లాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం దడ, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశాడు కానీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 100% లవ్, ప్రేమమ్, మనం, మజిలీ, లవ్ స్టోరీ లాంటి క్లాస్ మూవీస్ మాత్రం చైతూకి హిట్స్ ఇచ్చాయి. ఇప్పుడు చైతూ మళ్లీ మాస్ ఇమేజ్ పెంచుకోవడానికి కస్టడీ అనే మాస్ యాక్షన్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అలానే అఖిల్ తన ఫస్ట్ మూవీ అఖిల్ తోనే మాస్ ట్రై చేశాడు కానీ అది డిజాస్టర్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో హిట్టు కొట్టిన అఖిల్, ఇప్పుడు ఏజెంట్ లాంటి మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్‌తో రెడీగా ఉన్నాడు. మరి అక్కినేని హీరోలు మాస్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నం ఈ సారైనా ఫలిస్తుందా లేదా చూడాలి.













