Akhil6: సైలెంటుగా మొదలుపెట్టిన అఖిల్
అక్కినేని అఖిల్(Akkineni Akhil) కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఏజెంట్(Agent) సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా అఖిల్ ఇప్పటివరకు మరో సినిమా మొదలెట్టకపోవడమేంటని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ తన తర్వాతి సినిమాను వినరో భాగ్యము విష్ణుకథ(Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరితో(Murali Kirshore Abburi) ఓకే చేశాడు.
ఈ సినిమాకు లెనిన్(lenin) అనే వర్కింగ్ టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైనట్టు తెలుస్తోంది. శ్రీలీల(Sree Leela) అఖిల్ కు జోడీగా నటించనుంది. ఈ మూవీ విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఏజెంట్(Agent) కోసం ఎంతో కష్టపడినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో అఖిల్ కు ఇంకా కెరీర్ లో సరైన హిట్ పడలేదు.
ఈ నేపథ్యంలోనే సక్సెస్ వచ్చే వరకు ఫ్యాన్స్ ముందుకు కూడా రానని తనకు అఖిల్ మాటిచ్చాడని ఆ మధ్య ఓ సందర్భంగా నాగార్జున(Nagarjuna) చెప్పుకొచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటే మీద ఉంటూ ఎక్కడా బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ సినిమాను కూడా అఖిల్ వెంటనే ఒప్పుకోలేదు. కథ అందరూ విని నచ్చాకే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖిల్ కెరీర్లో 6వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ నిర్మిస్తోంది.













