అక్కినేని హీరో ఈసారైనా “ఏజెంట్” తో హిట్ కొడతాడా…?
అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని కి ఇప్పటివరకు గట్టి హిట్ పడలేదని చెప్పాలి. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసి ప్లాపులని రుచి చూసాడు ఈ హీరో. ప్రస్తుతం “ఏజెంట్” సినిమాతో మళ్ళీ తన లక్ ని పరీక్షించ్చుకోవడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన విషయం తెల్సిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వరకు ప్రచారం జరిగింది.
ఈ తరుణంలోనే చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏజెంట్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ సినిమా కొత్త విడుదల తేదీని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ తేదీ పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఏజెంట్ ని సంక్రాంతి సీజన్ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
మాములుగా తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల అవ్వవు. ఈ టూ మంత్స్ సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ అని నమ్ముతారు. అందుకే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు, రెండు నెలల్లో రిలీజవ్వడం చాలా తక్కువ. అయినా కూడా కంటెంట్ పై నమ్మకంతో అఖిల్ ఏజెంట్ ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు.
ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఏజెంట్ సినిమాలో కీలక పాత్రను మలయాళ స్టార్ మమ్ముట్టీ చేస్తూ ఉండగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. అఖిల్ లుక్ కు ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నయ్యని వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్ కొత్త సినిమా విడుదల తేదీ మరింత స్పష్టంగా ఒకటి రెండు వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈసారైనా అక్కినేని హీరో తన ఖాతాలో హిట్ ని వేసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.













