అకీరా డెబ్యూ ఆ సినిమాతోనే
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో వారసులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్(Pawan Kalyna) కొడుకు అకీరా నందన్(Akira Nandan) ఎంట్రీపైనే ఉంది. అయితే అకీరాకు యాక్టింగ్ కంటే మ్యూజిక్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు పలుమార్లు ప్రూవ్ అయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం అకీరాను హీరోగానే చూడాలనుకుంటున్నారు.
ప్రస్తుతం చదువులో బిజీగా ఉన్న అకీరా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(Viswambhara) సినిమాతో వెండితర అరంగేట్రం చేయనున్నాడని కొన్నాళ్ల కిందట వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని, అకీరా, తన తండ్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(OG) సినిమాతోనే డెబ్యూ ఇవ్వనున్నాడని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. సుజిత్(Sujeetha) దర్శకత్వంలో వస్తున్న ఓజీలో అకీరా కీలక పాత్ర పోషించనున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే అకీరాను ఓజీ సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలన్నది పవన్ ప్లాన్ కాదని సమాచారం. ఈ ప్లాన్ అంతా సుజిత్దేనని, పవన్ కు చెప్పిన వెంటనే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో అకీరా పవన్ చిన్నప్పటి రోల్ లో కనపడనున్నాడంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆనందిస్తున్నారు.













