డిసెంబర్ లో అఖిల్ ‘హలో’ అమెరికా పర్యటన!
అఖిల్ రెండో చిత్రం హలో విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ చిత్రంతో విజయం దక్కించుకునేందుకు అఖిల్, ఆ చిత్రబృందం చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు విభిన్నంగా ప్రచారం చేస్తున్న అఖిల్ ఇప్పుడు ఓవర్ సీస్లో కూడా దమ్ము చూపించాలని అభిమానులతో ఆడి పాడేందుకు రంగం సిద్ధం చేశాడు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
డిసెంబర్ 15, 16,17 తేదీల్లో న్యూజెర్సీ, డల్లాస్, శాన్జోసేల్లో పర్యటించనుంది. కేవలం పర్యటనే కాదు డాన్స్‌లు చేస్తూ, పాటలు కూడా పాడనున్నాడు. అంతే కాదండోయ్ ఆయనతో ఎవరైనా వేదికపై డాన్స్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చాడు అఖిల్. హలో ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. నాతో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేయాలనుకుంటున్నారా? త్వరలోనే మీ వద్దకు వస్తా. పాసెస్ కోసం ఇక్కడ చూడండి అంటూ అఖిల్అక్కినేని.ఇన్/హలోయుఎస్ఎ అని లింక్‌ను షేర్ చేశాడు అఖిల్. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. విక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కల్యాని కథనాయిక.













